జోరుగా యువత, గులాబీ పార్టీలోకి చేరికలు.జోరుగా యువత, గులాబీ పార్టీలోకి చేరికలు.

జోరుగా యువత, గులాబీ పార్టీలోకి చేరికలు.

పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ చైర్మన్ నవీన్ రావు

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.

మరిపెడ మండలం,చింతల గడ్డ తండా నుంచి కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన 35 కుటుంబాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులకు కండువా కప్పి బీఆర్ స్ పార్టీలోకి ఆహ్వానించిన..మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఈ చేరికల సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలన లోనే అన్ని వర్గాలప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలిపారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని అన్ని కులాల, వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకుందని విమర్శించారు. అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ హామీలను బూడిదలో పోసిన పన్నీరులా మార్చి, పేద కుటుంబాలను నట్టేట ముంచుతూ తీవ్రంగా మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలను నమ్మి మోసపోయామని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు, వ్యవసాయ రంగానికి సాగునీరు అందించలేని దౌర్భాగ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అన్నారు, కరెంటు సమస్యతో రైతులు అల్లాడిపోతున్నారన్నారు ఇవన్నీ చూసి ప్రజలు కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో యువకులు మేధావులు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు అజ్మీరా రెడ్డి,గంధసిరి కృష్ణ గౌడ్,అంగోత్ ధర్మ,రాంచంద్,శ్రీను,రమేష్,బీచ్చు,గణేష్,నాగేష్,నాగేశ్వర్,రాజేందర్,సోమన్న,కళ్యాణ్,సాయి,అశోక్,సిద్దు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *