విచారణలో తేలిన నిర్లక్ష్యం ఇరువురిపై చర్యకు సిఫారసువిచారణలో తేలిన నిర్లక్ష్యం ఇరువురిపై చర్యకు సిఫారసు

విచారణలో తేలిన నిర్లక్ష్యం ఇరువురిపై చర్యకు సిఫారసు

తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/అక్టోబర్ 28
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం జమాల్ పురం అంగన్వాడీ కేంద్రంలోకి విషపూరిత త్రాచుపాము ప్రవేశించిన ఘటన పత్రికల్లో రావడంతో పర్యవేక్షకురాలు డి. స్వరూపారాణి గారు కేంద్రాన్ని సందర్శించారు.జమల్ పురం సర్పంచ్,మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపారు. ఈ విచారణలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు జె.స్వరూప మరియు సహాయకురాలు డి. కల్పన నిర్లక్ష్యం స్పష్టంగా తేలింది.చిన్న పిల్లలు చదువుతో పాటు ఆటపాటలతో ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రం మరియు ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచి, పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యాయురాలు, సహాయకురాలిపై ఉంది. అయితే వారు చాలా కాలంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది.చెట్లు,పొదలు ఉన్న ప్రాంతంలో పాములు,తేళ్లు ఉండడం సహజమే అయినా,అవి కేంద్రంలోకి రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు.దీంతోనే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. అదృష్టవశాత్తు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు.ఈ నేపథ్యంలో పర్యవేక్షకురాలు డి. స్వరూపారాణి గారు మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయులు,సర్పంచ్ సమక్షంలో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు, సహాయకురాలికి తక్షణమే సంజాయిషీ నోటీసు జారీ చేసి, తగిన చర్య తీసుకోవాలని పై అధికారులకు సిఫారసు చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *