ములుగులో ఏఐటీయూసీ ఆందోళనములుగులో ఏఐటీయూసీ ఆందోళన
  • సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలి.. మంత్రి సీతక్క జోక్యం చేసుకోవాలి!
  • 9 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి.. ములుగులో ఏఐటీయూసీ ఆందోళన

తెలుగు గళం ములుగు, అక్టోబర్ 28:

మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న మహిళా వంట కార్మికుల ఉపాధిని దెబ్బతీసే సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ములుగులో ర్యాలీ నిర్వహించి, మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో మంత్రి వ్యక్తిగత సహాయకుడు లక్కీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ, 24 ఏళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న వంట కార్మికుల ఉపాధిని కాపాడాలని కోరారు. 2023–24 సంవత్సరానికి సంబంధించిన తొమ్మిది నెలల పెండింగ్ అల్పాహార బిల్లులను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, నెలవారీ బిల్లులు, వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.10,000 వేతనం, 12 నెలల వేతనాలు, వంట సరుకులు, గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. మంత్రి సీతక్క ముఖ్యమంత్రితో మాట్లాడి వంట కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి అల్పాహార పథకాన్ని కూడా స్థానిక వంట కార్మికుల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ముత్యాల రాజు, ప్రధాన కార్యదర్శి బండి నర్సయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పోరెడ్డి ప్రమీల, ప్రధాన కార్యదర్శి గడ్డం భారతి, ఇతర నాయకులు, పది మండలాల ప్రతినిధులు, సుమారు 400 మంది వంట కార్మికులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *