16వ రోజుకు సమ్మె
- డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆపేది లేదు..
- ములుగులో గాంధీ విగ్రహం ఎదుట కొనసాగుతున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె
తెలుగు గళం ములుగు, అక్టోబర్ 28:
ములుగు జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరసన సమ్మె బుధవారంతో 16వ రోజుకు చేరుకుంది. వర్షం కురుస్తున్నప్పటికీ ఉద్యోగులు వెనక్కి తగ్గకుండా సమ్మె దీక్షను కొనసాగిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమ్మె కొనసాగించడం ద్వారా తమ సమస్యల పరిష్కారం పట్ల ఉద్యోగులు పట్టుదలతో ఉన్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చి న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ నరహరి, నవీన్, తరుణ్, శ్రీనివాస్, పార్వతి, లోకప్రియ, చందన, అనిత, భవ్య, సిద్ధ, రజిని, దివ్య, సైకాలజిస్ట్ కిరణ్ కుమార్, ఫార్మసీ అధికారులు నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
