తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/అక్టోబర్ 28
వరంగల్ జిల్లా:పర్వతగిరి: ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న కల్లెడ పీఏసీఎస్ చైర్మన్ పిన్నింటి అనిల్ రావును వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరామర్శించారు. పర్వతగిరిలోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు సావిత్రి,వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్,ఎల్డీయం కోఆర్డినేటర్ కొందూరు వెంకటరెడ్డి,చౌటపల్లి సొసైటీ చైర్మన్ కుమారస్వామి, వర్ధన్నపేట మండల అధ్యక్షులు పోశాల వెంకన్న,వర్ధన్నపేట సొసైటీ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి,మాజీ ఇల్లంద మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పర్వతగిరి మండల మహిళా అధ్యక్షురాలు సువార్త, మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నే బాబురావు, వడ్లకొండ గ్రామ శాఖ అధ్యక్షులు డెక్క అనిల్, జిల్లా, మండల నాయకులు,సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
