ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
  • విద్యార్థులకు 21 రకాల వస్తువులు 100 శాతం అందాలి!
  • పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో

తెలుగు గళం ములుగు, అక్టోబర్ 29:

హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అవసర వస్తువుల పంపిణీలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో సదుపాయాలు అందించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లోని మండల వనరుల కేంద్రాలను (ఎంఆర్‌సీ) సందర్శించి, విద్యార్థులకు పంపిణీ చేస్తున్న వస్తువుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన హాస్టల్ విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాం వస్త్రాలు, ఐడీ కార్డులు, బెల్టులు, బ్లాక్ షూస్, వైట్ షూస్, సాక్సులు, ట్రాక్ షూస్, స్కూల్ బ్యాగులు, బెడ్‌షీట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంక్ బాక్సులు, దుప్పట్లు, నైట్ డ్రెస్‌లు తదితర 21 రకాల వస్తువుల పంపిణీ వివరాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు కేటాయించిన వస్తువులు వాస్తవంగా అందాయా లేదా అనే విషయాన్ని రికార్డులతో సరిపోల్చి ధృవీకరించాలని సూచించారు. పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ, ప్రతి విద్యార్థికి నిర్దేశించిన అన్ని వస్తువులు అందేలా పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఏ విద్యార్థికి కూడా వస్తువుల పంపిణీలో అన్యాయం జరగకుండా, 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు వారికి పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని పీఓ సూచించారు. పంపిణీ వివరాల్లో తేడాలు లేకుండా రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం మండల విద్యాశాఖ అధికారి మల్లయ్య, తాడ్వాయి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *