జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘుజిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు
  • మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు
  • నీటి పొదుపు, రైతులకు అవగాహన, గ్రామాల అభివృద్ధిపై ప్రధాన చర్చ

తెలుగు గళం ఏటూరునాగారం, అక్టోబర్ 29:

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటికి సత్వర పరిష్కారం చూపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గురువారం ఏటూరునాగారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మండల తహసీల్దార్ గుర్రం జగదీష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ వినియోగం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు సూచించారు. పశువులకు నీటి కొరత ఏర్పడకుండా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని, వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఫామ్ పాండ్స్, పంట కుంటలు, ఇంకుడు గుంతలు, ఇంటి కుంటలు నిర్మించుకోవాలని సూచించారు. విద్యుత్‌ను కూడా పొదుపుగా వినియోగించేలా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను మండల సర్వసభ్య సమావేశాల ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునేందుకు సర్పంచులు, ప్రజలకు అవకాశం కలుగుతుందని చిటమట రఘు పేర్కొన్నారు. ప్రతి సమస్యను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విద్య, వ్యవసాయం, ఐసీడీఎస్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, వైద్య, పశుసంవర్ధక, ఇంజనీరింగ్ తదితర శాఖల అధికారులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *