భూపాలపల్లి, ములుగు జిల్లాల వాహన యజమానులు, డ్రైవర్ల విజ్ఞప్తిభూపాలపల్లి, ములుగు జిల్లాల వాహన యజమానులు, డ్రైవర్ల విజ్ఞప్తి

ఇంధన ధరల భారంతో వాహన యజమానులు, డ్రైవర్లకు ఆర్థిక ఇబ్బందులు

బిల్లులు సవరించి ఆదుకోవాలని సూపరింటెండింగ్ ఇంజినీర్‌కు వినతి

భూపాలపల్లి, ములుగు జిల్లాల వాహన యజమానులు, డ్రైవర్ల విజ్ఞప్తి

తెలుగు గళం ములుగు, అక్టోబర్ 29:

పెరుగుతున్న డీజిల్ ధరలకు అనుగుణంగా వాహనాల బిల్లులను పెంచి తమను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన వాహన యజమానులు, డ్రైవర్లు కోరారు. ఈ మేరకు వారు సూపరింటెండింగ్ ఇంజినీర్‌ను కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరలతో పాటు వాహనాల నిర్వహణ, మరమ్మతులు, ఇతర ఖర్చులు అధికమవుతున్నాయని యూనియన్ సభ్యులు తెలిపారు. అయితే ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా వాహనాల బిల్లులు పెరగకపోవడంతో తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత వాహనాల బిల్లులను సవరించి పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. అధికారులు తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి, బిల్లుల పెంపునకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బిల్లులు పెంచితే వాహన యజమానులు, డ్రైవర్లకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *