వెంగళరావు నగర్ డివిజన్ డిప్యూటీ డి వో ఆఫీస్ ప్రవేట్ కార్పోరేట్ స్కూల్లలో బుక్స్ యూనిఫామ్ దందా అరికట్టాలి సిపిఎం………. డిప్యూటీ డి ఈ ఓ ఖైరతాబాద్ గారికి వినతి పత్రం సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ కన్వీనర్ జవహర్ నగర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని ప్రైవేటు స్కూల్స్ బుక్ షాపు ,షాపింగ్ మాల్స్ లాగా (డ్రెస్సులు) మాదిరిగా మారాయని బుక్స్ యూనిఫామ్స్ ఎల్కేజీ ,టెన్త్ క్లాస్ వరకు 6000 నుంచి 10000 వరకు వసూలు చేస్తున్నారని ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు తల్లిదండ్రుల కష్టార్జితమును విద్య పేరుతో దోపిడీ చేస్తున్నారని ఈ విధంగా చేయడం సరైనది కాదు కాబట్టి వెంటనే ఈ ప్రైవేటు విద్యాసంస్థ లు బుక్స్ ,యూనిఫామ్ దందా ఆపి పేద మధ్యతరగతి ప్రజలను కాపాడాలని సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కి విజ్ఞప్తి చేయడం జరిగింది