
బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి-మెపా జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్
E69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం కేంద్రంలో మరియు రేగొండ మండలంలోని కోటంచ గ్రామంలో నిర్వహించిన మెపా రాష్ట్ర అధ్యక్షుడు కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఆకుల సుభాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెపా ముఖ్య కార్యకర్తల సమావేశంలో అక్టోబర్ 01న పరకాలలో జరిగే ముదిరాజ్ సింహగర్జన సభ బైక్ ర్యాలీ కరపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొపెషనల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ హాజరై మేపా జిల్లా నాయకులు మెపా ప్రధాన కార్యదర్శి కౌటాం రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు అల్లం స్వామి, కోశాధికారి జోడు ఈశ్వర్, మెప సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జ్ జోడు ప్రదీప్ ముదిరాజ్,మరియు మెపా నాయకుల ఆధ్వర్యంలో కర పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం,ఆకుల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజులు విద్య ఉద్యోగ ఆర్థిక సామజిక రాజకీయ రంగాలలో సరైన రిజర్వేషన్ లేక అన్ని రంగాలలో అభివృద్ధికి అత్యంత దినస్థితిలో రాష్ట్ర ముదిరాజ్ వ్యవస్థ వుందని,రాష్ట్రంలో 60లక్షలకు పైగా జనాభా కలిగి,జనాభా దామాషా ప్రకారం 15%వున్నామాకు చట్టసభల్లో ప్రతి రాజకీయ పార్టీ ఎంఎల్ఏ,ఎంపి స్థానాలతో పాటు మా ముదిరాజ్ కులం బిసి-డి నుండి బిసి-ఏ కు మార్చాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ
కార్యక్రమంలో,గోరుకొత్తపల్లి మండల కమిటీకి చెందిన మారబోయిన ధనంజయ్ మారబోయిన చందు మూడేళ్ల దేవేందర్ మూడేళ్ల కుమార్ నిమ్మల రాజు మైపాల్ తిరుపతి,కోటంచ గ్రామానికి చెందిన మల్లవేణి సురేష్ నరేష్ రాజు నగరం రాజు పోలు ఓదెలు నరేష్ కట్టల రవి జగన్ శివ రవి బోగరి అర్జున్ నవీన్ నాగుల పురుషోత్తం మలబోయిన రాజయ్య పోలు మొగిలి తదితర మెపా నాయకులు