అగ్నిపథ్ పథకంలో అగ్నివీర్ నియామకాలు
భారత సైన్యంలో చేరే అవకాశం–ఏప్రిల్ 1లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచన
వివాహం కాని పురుష అభ్యర్థులకు మాత్రమే అవకాశం–అర్హతలు ప్రకటించిన అధికారులు
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత సైన్యంలో అగ్నివీర్లుగా చేరేందుకు అర్హత కలిగిన యువకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి సి.హెచ్. రఘు తెలిపారు.2027 సంవత్సరానికి సంబంధించిన ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అధికారికంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అగ్నివీర్ నియామకాలకు వివాహం కాని పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.కనీస విద్యార్హతగా 8వ తరగతి లేదా అంతకంటే పై చదువు పూర్తిచేసి ఉండాలని తెలిపారు.అలాగే అభ్యర్థులు 01 జూలై 2005 నుండి 01 జూలై 2009 మధ్య జన్మించి ఉండాలని స్పష్టం చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన అర్హత కలిగిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 1, 2026 లోపు భారత సైన్యం అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అగ్నిపథ్ పథకం ద్వారా దేశ సేవ చేసే అవకాశం లభిస్తుందని,యువతలో దేశభక్తిని పెంపొందించడంతో పాటు శారీరక,మానసిక దృఢత్వాన్ని పెంచేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు.అర్హతలు,ఎంపిక,విధానం,ఇతర వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌పోర్టల్‌ను సందర్శించాలని సూచించారు.జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని భారత సైన్యంలో చేరాలని జిల్లా యువజన,క్రీడల అధికారి పిలుపునిచ్చారు