అమ్మమాట–అంగన్వాడి బాట’ కార్యక్రమం
చిన్నారుల విద్యాభ్యాసానికి బలమైన పునాది వేయడం, తల్లిదండ్రుల్లో విద్య పట్ల అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మమాట–అంగన్వాడి బాట’ కార్యక్రమం గురువారం ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని అడసర్లపాడు గ్రామంలో నిర్వహించనున్నారు. గ్రామంలోని 6వ అంగన్వాడీ కేంద్రంలో మూడు సంవత్సరాల చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడంతో పాటు బడిబాట ర్యాలీ చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామ సర్పంచ్ కాటే జమలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ ఇజ్జిగాని గంగాజలం, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, ఏఎన్ఎం శ్రీలక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయులు పద్మ, శాలిని, విజయ్కుమారి, వెంకటమ్మ, నిర్మల, ఆశా కార్యకర్త ఏసమ్మతో పాటు చిన్నారుల తల్లులు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రిపై ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. గ్రామంలో విద్యా ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు బడిబాట ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు వారు పిలుపునిచ్చారు
Nice