ఎంఈఓకు వినతిపత్రం అందజేసిన యూత్ కాంగ్రెస్ నాయకుడు షేక్ జానీ బాబా
ఎంఈఓకు వినతిపత్రం అందజేసిన యూత్ కాంగ్రెస్ నాయకుడు షేక్ జానీ బాబా
తెలుగు గళం న్యూస్ స్టేషన్ ఘన్పూర్, జూన్ 18
స్టేషన్ ఘన్పూర్ మండలంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సీబీఎస్ఈ సిలబస్ పేరుతో తల్లిదండ్రులను నమ్మిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపిస్తూ జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షేక్ జానీ బాబా మండల విద్యా అధికారి (ఎంఈఓ)కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు.అలాగే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్ములు మరియు ఇతర విద్యా సామగ్రిని పాఠశాలల ద్వారానే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.ఇలాంటి పాఠశాలలపై వెంటనే విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓను కోరారు.విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు చి. అఖిల్, సాయి వైష్ణవ్, సృజన్, ఫయాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.