ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన ప్రజాప్రతినిధులు
హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం వనమాల కనపర్తి గ్రామంలో బొమ్మ వైష్ణవి, శివ దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసే కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రిపీక ఎల్లస్వామి, ఉపసర్పంచ్ నోముల కుమార్, స్థానిక 1వ వార్డు సభ్యురాలు పోలేపాక అంజలి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు నెల్లుట్ల ప్రవీణ్ కుమార్, రిపీక వినయ్,రిపీక సారమ్మ తదితరులు పాల్గొన్నారు.