రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రేణిగుంట మండలం ఆంజనేయపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.