ఆర్టీసీ కార్మికుల పక్షాన టీఆర్పీ పోరాటం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టిజిఎస్ ఆర్టిసి డిపో ముందు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పోరాట ఉధృతిని సంతరించుకుంది.ఈ ఆందోళన కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ హాజరై కార్మికులకు తన పూర్తి స్థాయి మద్దతును ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన కార్మికులతో కలిసి డిపో ఎదుట రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణలో భాగంగా ఇవ్వాల్సిన 30 శాతం ఫిట్మెంట్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2025 వేతన సవరణ ప్రక్రియను కూడా జాప్యం లేకుండా ప్రారంభించాలని కోరారు.ఆర్టీసీ సంస్థ మనుగడ సాగించాలంటే ప్రభుత్వం ప్రతి నెలా 400 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని రవి పటేల్ సూచించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, పెండింగ్లో ఉన్న ట్రేడ్ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలన్నారు. సంస్థలో పెరిగిన పనిభారాన్ని తగ్గించాలని, కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే అద్దె బస్సు డ్రైవర్లను కూడా ఆర్టీసీలో విలీనం చేసి, కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలబడుతుందని, సమ్మె నోటీసులో పేర్కొన్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని రవి పటేల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల ప్రణయ్ రాజ్, అనంతల సంపత్, జిల్లా కోశాధికారి జిలకర శ్రీను,జిల్లా కమిటీ సభ్యుడు వైద్య లక్ష్మణ్, కార్మిక సం