తెలుగు గళం న్యూస్ భద్రాచలం
గిరిజన సంక్షేమ పథకాలు అమలులో అంకిత భావం నిబద్ధత మరియు గిరిజనుల సంక్షేమం కొరకు అభివృద్ధి పట్ల విశిష్ట సేవలు అందించినందుకు గాను ఉత్తమ ప్రాజెక్టు అధికారిగా అవార్డు అందుకోవడం జరిగిందని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన జాతీయ పీవోస్ కార్పొరేషన్ లో దేశంలోని ఉత్తమ ప్రాజెక్టు అధికారిగా అవార్డును నీతి అయోగ్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీస్ సెక్రెటరీ రంజాన్ చోప్రా చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం, ఎస్ సి హెచ్ జి మహిళలు గిరిజన రైతులు చిన్న తరహా పరిశ్రమలు నడుపుకుంటున్న గిరిజన మహిళలకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ మరియు జిపిఎస్ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు విద్యార్థిని విద్యార్థులకు ఉద్దీపకం మరియు కెరీర్ గైడెన్స్ అమలు చేయడం గిరిజన తెగల గోత్రాల సేకరణ చేసి ఇలవేల్పుల చరిత్ర తో పాటు క్రీడల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేసినందుకు ఈ పురస్కారం లభించిందని అన్నారు.
మంచిర్యాల జిల్లాలో స్థానిక సంస్థల జేసీగా పని చేసినప్పుడు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీ సెస్ అవార్డును గవర్నర్ చేతులు మీదుగా బెస్ట్ రూరల్ టూరిజం అవార్డును ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఆదివాసి గిరిజనుల ఐక్యవేదిక తరపున ఆదివాసి వికాసరత్న బిరుదును అందుకోవడం జరిగిందని ఐటిడిఏ సంక్షేమ పథకాలు మరియు గిరిజనుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నందుకు ఇప్పుడు జాతీయ స్థాయిలో అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

