ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఏకీకరణ కమిటీ
ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఏకీకరణ కమిటీ కే.కే. కమిటీ చర్చలపై సమీక్ష.. ఉద్యమకారుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలంగాణ ఉద్యమకారుల ఏకీకరణ కమిటీ కన్వీనర్ మల్లూరి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్లోని సికింద్రాబాద్, సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ తెలంగాణ ఉద్యమ సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జూలై 6 నుంచి 23 వరకు ప్రభుత్వ నియామకంలోని కే.కే. కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులతో జరిగిన చర్చలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. చర్చలు సానుకూల వాతావరణంలో, నిర్మాణాత్మకంగా సాగి విజయవంతంగా ముగిశాయని సమావేశంలో పాల్గొన్న ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు.
చర్చల సారాంశాన్ని కే.కే. కమిటీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సమావేశం ఏకగ్రీవంగా కోరింది. తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.
అవసరమైతే తెలంగాణ ఉద్యమకారుల ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీలను కలిసి ఉద్యమకారుల సమస్యలను వివరించి, డిమాండ్ల పరిష్కారం కోసం వారి సహకారాన్ని కోరనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో సుల్తాన్ యాదగిరి, తుమ్మల ప్రపోల్ రాంరెడ్డి, బత్తుల సోమయ్య, కొంతం యాదగిరి రెడ్డి, రామగిరి ప్రకాష్, పండు గౌడ్, జానకి రెడ్డి, కోతి మాధవి, వి. అరుణ, జెనిగే విష్ణువు, అనుముల రవీందర్, బీరకాయల మధుసూదన్, గౌరీ గణేష్, జనగాని రాజు గౌడ్, సాయిబాబా, రాంబాబు, జనార్ధన్, శంకర్, లక్ష్మణ్, కంది నారాయణ, కుప్ప శ్రీనివాస్ గౌడ్, అమర్, బండ నర్సింగ్ తదితర తెలంగాణ ఉద్యమ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.