ఎమ్మెల్సీ సురభి వాణి దేవి 75వ జన్మదిన వేడుకలు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలంలో భారత మాజీ ప్రధాని,భారతరత్న పీవీ నరసింహారావు గారి కుమార్తె,గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సీనియర్ నాయకులు,కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కోహెడలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు, చిన్నారులు,అలాగే సమీప ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతను చాటుతూ ప్రజల మనసులు గెలుచుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సురభి వాణి దేవి గారు విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన గొప్ప విద్యావేత్తగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె ఆధ్వర్యంలో స్థాపించబడిన విద్యాసంస్థల ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని డాక్టర్లు,ఇంజనీర్లు, అధికారులు గా ఎదుగుతున్నారని తెలిపారు.అలాగే, ఆమె తండ్రి పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో అనేక దేశాల పర్యటనలలో భాగస్వామ్యం అవుతూ, కీలక సూచనలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు.ఆమె సేవా దృక్పథం,విద్యాపట్ల అంకితభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.భవిష్యత్తులో కూడా మరెన్నో ఉన్నత స్థానాలు అధిరోహించి ప్రజాశ్రేయస్సు కోసం సేవలు అందించాలని,ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, ఆయా రాగుల స్వర్ణలత, గర్భిణీ స్త్రీలు, మహిళలు, చిన్నారులు అక్షర, హనీ, రిషిత, వర్షిత్ తేజ, శ్రీమాన్, స్వాతి, సోనియా తదితరులు పాల్గొన్నారు.