గిరిజన గ్రామాలకు సురక్షిత రాకపోకలే లక్ష్యం
వరదల వేళ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోటు సేవలు అందించాలని అధికారుల ఆదేశాలు..!
గిరిజన గ్రామాలకు సురక్షిత రాకపోకలే లక్ష్యం
తెలుగు గళం ఏటూరునాగారం ములుగు :
ములుగు జిల్లా, ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి జంపన్న వాగులో కొనసాగుతున్న బోటు రవాణా సేవలు సక్రమంగా నడుస్తున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించేందుకు అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వాగులో పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బోటు సేవలు కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. బోటు నిర్వహణ, ప్రయాణికుల భద్రత, రాకపోకల పరిస్థితులను పరిశీలించిన అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ పరిశీలనలో అల్లవారి ఘనపురం పంచాయతీ కార్యదర్శి వినోద్, వీఆర్ఓ జనార్దన్, సర్పంచ్ పలక మహాలక్ష్మి, చల్పాక పంచాయతీ కార్యదర్శి సందీప్, గ్రామ సర్పంచ్ అట్టం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.