ఐఈసి 2026 వైస్ ప్రెసిడెంట్‌గా మర్యాల చంద్రమౌళి గుప్తా
తరఫున జ్యోతిష్య శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ (Honorary Doctorate) ప్రదానం చేయబడింది.
విద్య, ఆధ్యాత్మికత, సామాజిక సేవ మరియు ప్రజలతో సాన్నిహిత్యంతో కొనసాగుతున్న సేవలను గుర్తించి ఈ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు. వివిధ రంగాలలో సమాజానికి అందించిన సేవలు, నాయకత్వ లక్షణాలు మరియు ప్రజా సేవ పట్ల ఉన్న నిబద్ధతను ప్రశంసిస్తూ ఈ గౌరవాన్ని అందజేయడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు, ఇకముందు మర్యాల చంద్రమౌళి గుప్తాను “డాక్టర్ మార్యాల చంద్రమౌళి గుప్తా”గా పరిగణించబడతారని అధికారికంగా ప్రకటించారు. ఈ గౌరవం ఆయనకు లభించడం ఆయన సేవలకు దక్కిన ప్రత్యేక గుర్తింపుగా భావించబడుతోంది.
డాక్టర్ మార్యాల చంద్రమౌళి గుప్తా కు గౌరవ డాక్టరేట్ లభించిన సందర్భంగా అనేక మంది ప్రముఖులు, మిత్రులు, శుభాకాంక్షకులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా సమాజ సేవ, శాంతి, సాంస్కృతిక మరియు మానవ విలువల పరిరక్షణలో మరింత సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.