ఒగ్గు పూజారి మాతృమూర్తి మృతికి నివాళి
వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామానికి చెందిన ఒగ్గు పూజారులు బెల్లం మల్లేశం,బెల్లం ధూడెల్,బెల్లం శ్రీశైలం ల మాతృమూర్తి బెల్లం బీరమ్మ మరణించారు.బీరమ్మ మరణ వార్త తెలుసుకున్న వర్ధన్నపేట శాసన సభ్యులు కె.ఆర్.నాగరాజు కట్రియాల గ్రామానికి.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పూజారి శ్రీశైలం ఇంటి వద్దకు వెళ్లి బీరమ్మ భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఒగ్గు పూజారులు మల్లేశం,ధూడెల్, శ్రీశైలం మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మల్లన్న స్వామిని కొలిచే ఒగ్గు పూజారుల కుటుంబం కావడంతో బీరమ్మ ఆత్మకు శాంతి కలగాలని,గ్రామ కులదైవమైన కట్రియాల శ్రీమల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం తక్షణమే 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎద్దు సత్యం,వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,పి ఏ సి ఎస్ చైర్మన్ కౌడగని రాజేష్ కన్నా,కట్రియాల ఉప సర్పంచ్ నాంపేల్లి రవీందర్,కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండీ అక్బర్, వార్డు సభ్యురాలు చెవ్వల్ల సమత, వార్డు సభ్యురాలు ఇటికాల శ్రీలత రాజు,కట్రియాల మాజీ దేవాలయ చైర్మన్ కట్ట వెంకటయ్య,ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు మరుపట్ల సాయికుమార్,మల్లెపాక సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ మండల నాయకుడు దొమ్మటి రాము,కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర సురేందర్, చెవ్వల్ల రమేశ్,చెవ్వల్ల నారాయణ, కామిండ్ల రాజు కుమార్,గోరుకొంటి అయ్యాలు,కామిండ్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.