
కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం.
ఈ రోజు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ” శివసేన రెడ్డి గారు ” మరియు ” టీపీసీసీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారి “మరియూ సిద్దిపేట జిల్లా యూత్ కాంగ్రేస్ అధ్యక్షురాలు తుంకుంటా ఆంక్షరెడ్డి గారి ఆదేశాలు మేరకు….
ఈ రోజు కొమురవేల్లి మండల కేంద్రంలో కొమురవేల్లి మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ గారి అధ్యక్షతన జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
కాంగ్రెస్ పేద ప్రజలకుఆరోగ్య శ్రీ ద్వారా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యము.
మరియు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫి.
పండించిన పంటకు గిట్టుబాటు ధర,500 రూపాయలకు గ్యాస్ ,రేషన్ ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ.
సొంత ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సహాయం.
నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ,రైతు కూలీలు ,భూమి లేని రైతులకు సైతం రైతు భీమా పథకం.
వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంట భీమా పథకం.
ప్రజల సంక్షేమం కోసం అందించే పథకాలను వివరిస్తూ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యకరమానికి ముఖ్య అతిథిగా జనగామ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట క్రాంతి కుమార్ గారు పాల్గొన్నారు..
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రేస్ నాయకులు గిస లింగం, గొల్లపల్లి శ్రీనివాస్ ,లింగం పల్లి శ్రీను,లింగం పల్లి సురేష్, గుండా మహేష్,దువ్వల శ్రీనివాస్, సనది భాను ప్రకాష్,లింగం పల్లి నాగరాజు,లొంక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు