కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లు
కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే విధంగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి శింగు నరసింహారావు, అంగన్వాడి అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ జనల్ సెక్రెటరీ సిహెచ్ సీతామాలక్ష్మి, ఏఐటియుసి ఖమ్మంజిల్లా ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ పిలుపునిచ్చారు.
సోమవారం సత్తుపల్లిలో ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె పోస్టర్లు ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడచిన శతాబ్ద కాలంలో ఏఐటీయుసీ నాయకత్వంలో భారత కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాలు చేసి 44 కార్మిక సంక్షేమ హక్కుల చట్టాలను సాధించిందన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కార్మికుల సంఘ హక్కు, సమ్మె హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. స్వతంత్రం వచ్చినప్పటినుండి కార్మికుల ప్రజల త్యాగాలతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను , దేశ సంపదను అదాని అంబానీ లాంటి కార్పొరేట్ పెట్టుబడిదారులకు కారుచౌకగా దోచిబెడుతున్నారు. దేశం అప్పు 58 లక్షల కోట్ల నుండి 214 లక్షలకు పెరిగిందని,
పేద ప్రజలపై భారం మోపి లక్షల కోట్ల రూపాయలు సంపన్నులకు రాయితీలు ఇస్తున్నారు.
పర్మనెంట్ విధానం రద్దుచేసి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంతో ఉద్యోగులను కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న ఎల్ఐసి, బ్యాంకులు తదితర రంగాలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తున్నారు.
ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలని, అంగన్వాడి, మధ్యాహ్న భోజన, ఆశా తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రు 26,000 అమలు చేయాలని, కనీస పెన్షన్ నెలకు 9000 రూపాయలు ఇవ్వాలని,
నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేయాలని తదితర డిమాండ్లతో జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తాటి వెంకటేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ దండు ఆదినారాయణ, నాయకులు తడికమళ్ళ యోబు మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి నిర్మల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎస్కె రహమతుల్లా, ఖురాన్ సాబ్, షేక్ మైబు, తదితరులు పాల్గొన్నారు.