


ఈ69 న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్ 25
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం కూనూరు ఉన్నత పాఠశాలలో విద్యార్థి క్రీడాకారుల కోసం వేసవి క్రీడా శిక్షణా శిబిరం శనివారం ప్రారంభమైంది.ఏప్రిల్ 25 ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరం 15 రోజుల పాటు కొనసాగనుంది అని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్ తెలిపారు.జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య ఆదేశాలు, ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ కోశాధికారి కాటంరాజు రెడ్డి సలహాల మేరకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రారంభ రోజున సుమారు 30 మంది విద్యార్థులతో బాల్ బ్యాడ్మింటన్ శిక్షణ ప్రారంభించామని, అలాగే వాలీబాల్, సెపక్ టక్రా వంటి క్రీడల్లో కూడా శిక్షణ అందిస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ పర్వాజ్ మాట్లాడుతూ శిబిరం నిర్వహణకు సహకరించిన అసోసియేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ ఆకుల సాయికుమార్, వాలీబాల్ ఇన్స్ట్రక్టర్ చందా సాంబరాజులను ప్రత్యేకంగా అభినందించారు.