కొత్త కరెంటు స్తంభాలను ఏర్పాటు చేస్తున్న కార్పొరేటర్
ఖమ్మం పట్టణం ఏప్రిల్ 14, ఖమ్మం జిల్లా : 48వ డివిజన్ గణేష్ నగర్ ప్రాంతంలో ప్రజలకు మంచినీటి కష్టాలకు చెక్ పెట్టే విధంగా డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు మిషన్ భగీరథ పైపులను ప్రభుత్వం అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేస్తూ పైపుల ఏర్పాటు చేసే క్రమంలో అడ్డుగా వస్తున్న బండ రాళ్లను తొలగించి పూర్తిస్థాయిలో పారదర్శకంగా భగీరథ పైపుల ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో విద్యుత్ అధికారులచే కొత్త స్తంభాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని డివిజన్ కార్పొరేటర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. డివిజన్ లో జరుగుతున్న ఈ అభివృద్ధి పనుల పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.