పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న
తెలుగు గళం న్యూస్ హన్మకొండ, జూన్ 5
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంగణంలోని జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2026–2027 విద్యాసంవత్సరానికి గాను రెగ్యులర్ ఎంఏ (తెలుగు) కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు.విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న పలు పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎంఏ (తెలుగు) కోర్సులో చేరదలచిన అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అభ్యర్థులు ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుగు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లైన www.teluguuniversity.ac.in మరియు www.pstucet.org ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.సాధారణ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు 2026 జూన్ 24 వరకు అవకాశం ఉండగా, ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.ప్రవేశాలకు సంబంధించిన ఇతర వివరాల కోసం 9989417299, 9989139136, 7989385451 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చని డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు.