ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
•అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి/ జూన్09
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దేవిలాల్ తండాలో గిరిజన సోదర సోదరీమణుల ఆహ్వానం మేరకు మంగళవారం దుర్గమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు,గ్రామ ప్రజల సుఖశాంతులు,ఆయురారోగ్యాలు, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని వారి ఆత్మీయ అభినందనలు స్వీకరించారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, “గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు తెలంగాణ సమాజానికి గర్వకారణం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కట్టుబడి పనిచేస్తోంది.ప్రతి గ్రామం అభివృద్ధి చెందేలా,ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది”అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్,మాజీ ఏఎంసీ డైరెక్టర్ పిన్నింటి సునీల్ రావు, స్థానిక సర్పంచ్ చీదురు శంకర్,అన్నారం సర్పంచ్ గాడిపెల్లి మహేందర్,మాజీ జడ్పీటీసీ భానోత్ సింగులాల్, వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం,ఐనవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు,పెద్దలు, మహిళలు,యువత, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గిరిజన సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.