మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు ఆయనను పరామర్శించారు.
మాజీ జడ్పీటీసీ మెడిశెట్టి రాములు
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి/ జూన్5
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల కేంద్రంలో దౌలత్ నగర్ కు చెందిన బర్ల రాజశేఖర్ తల్లి ఇటీవల మరణించిన వార్త తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు ఆయనను పరామర్శించారు. రాజశేఖర్ ను ఆత్మ స్థైర్యం కోల్పోరాదని, ధైర్యంగా నాన్నకు సేవచేయాలని ఆయన కోరి ఆర్థిక సహాయం అందించారు. ఆయన వెంట మాజీ వైస్ యంపీపీ గంగాదర్ రావు,మాజీ జిల్లా పరిషత్ సభ్యులు మహ్మద్ సర్వర్,నాయకులు సింగారపు రమేష్, వెంకన్న, దర్గస్వామి, బొట్ల కుమార్ గడల రాజు,వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.