
అనేక కాలనీలో వందల సంఖ్యలో జ్వరాల బారిన పడిన ప్రజలు..
*రోజు విడిచి రోజు ప్రతి వార్డులో బ్లీచింగ్ చల్లాలి ..
*సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలి ..
సిపిఐ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు కు వినతిపత్రం సమర్పణ..
భద్రాచలం..28/09/2023.
భద్రాచలం పట్టణంలో ప్రతి కాలనీలో వందల సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారని పారిశుధ్య నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పట్టణంలో మరింత ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అదేవిధంగా ప్రతి కాలనీలో రోజు విడిచి రోజు బ్లీచింగ్ చల్లాలని ప్రతిరోజు ప్రతి కాలనీలో ఫాగింగ్ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో భద్రాచలం గ్రామపంచాయతీ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు..
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మారెడ్డి శివాజీ. బత్తుల నరసింహులు.మీసాల భాస్కరరావు. svs నాయుడు. చాడ శోభన్. యువజన నాయకులు కొలిపాక శివ. మారెడ్డి గణేష్. తదితరులు పాల్గొన్నారు