
పిడుగు పడి వ్యక్తి మృతి
పిడుగు పడి మృతి చెందిన పాయం పుల్లయ్య కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని సిపియం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్
దుమ్ముగూడెం మండలం వైట్ నాగారం గ్రామానికి చెందిన
పాయం పుల్లయ్య నిన్న పశువులు మేపటానికి వెళ్లిన పుల్లయ్య నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం మూలంగా పాయం పుల్లయ్య పైన పిడుగు పడి అక్కడికక్కడే మరణించారు సిపిఎం దుమ్ముగూడెం మండలం అతనికి ప్రభుత్వం నుండి సహాయం సహకారాన్ని అందించాలి, ఆ పేద కుటుంబానికి గృహలక్ష్మి ఇల్లు కూడా అమలు చేయాలి పిడుగు పడి చనిపోయాడు కాబట్టి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాయం అందించాలని భద్రాచలం నియోజవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకస జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, మర్మం చంద్రయ్య ,తూరుబాక ఉప సర్పంచ్ బొల్లి సత్యనారాయణ, తన కుమారుడు పాయం వెంకటరత్నం, బిల్లా ముత్యాలరావు ,నిమ్మల మధు, కాకా కామయ్య, వేలుపుల చలమయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు