ప్రజల సమస్యలపై ప్రత్యక్ష చర్చలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” (99 రోజుల యాక్షన్ ప్లాన్) కార్యక్రమంలో భాగంగా, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లోని నాయకులగూడెం గ్రామంలో వార్డు సభ నిర్వహించారు. ఈ సభకు 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి అధ్యక్షత వహించారు.
కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంతో ప్రారంభించి, గత రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ప్రజా సేవలపై సమగ్రంగా వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన సందేశాన్ని కూడా ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, డివిజన్ పరిధిలోని సమస్యలను ప్రత్యక్షంగా చర్చించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యర్థనలు ఆధారంగా పలు ముఖ్య అంశాలను తీర్మానాలుగా ఆమోదించి, వాటిని మినిట్స్ బుక్లో నమోదు చేశారు.
ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, కొత్తగూడెం సొసైటీ మాజీ అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు, వ్యవసాయ అధికారి నర్మద, 21వ డివిజన్ స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, మున్సిపల్ అధికారి కిరణ్, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభ నిర్వహణలో భాగస్వాములయ్యారు.