ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహణ
మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పోలే శివ, తలారి సత్యనారాయణ, సోమరాజు అరవింద్, మాజీ ఉప సర్పంచ్ కావాలి జగన్,కారోబార్ కావలి పరమేష్, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వచ్చిన ఓటర్లకు అవసరమైన దరఖాస్తు పత్రాలను అందజేసి, ఓటరు జాబితాలో పేరు నమోదు, వివరాల సవరణ, మార్పులు, తొలగింపులకు సంబంధించిన విధివిధానాలను వివరించారు. ఓటు హక్కు కలిగిన ప్రతి అర్హత గల పౌరుడు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లు, వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేయించుకోవాలని సూచించారు.
అలాగే ప్రజల్లో ఓటరు నమోదు, సవరణలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించి తమ వివరాల నమోదు, సవరణ ప్రక్రియలో పాల్గొన్నారు.