
bob news station ghanpur news local news aiks news
తెలంగాణ రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి నక్క యాకయ్య
జఫర్ ఘడ్: తెలంగాణ రైతు సంఘం జఫర్గడ్ మండల కమిటీ ఆధ్వర్యంలో బరోడా బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం మండల ప్రధాన కార్యదర్శి నక్క యాకయ్య మాట్లాడుతూ ……
*స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కొత్త రైతులకు పంట రుణాలు ఇవ్వాలని లక్ష లోపు పంట రుణాలను ఏకకాలంలో మిత్తితో సహా మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని రెన్యువల్ పేరుతో పాత రుణాలను కొత్త రుణాలుగా మార్చే బుక్ అడ్జస్ట్మెంట్ విధానం ఆపాలని బ్యాంకులో రైతుల లోన్ అకౌంట్లను ఎప్పటికప్పుడు బ్యాంక్ అధికారులు అప్డేట్ చేయాలని కొంతమంది బ్యాంకు అధికారులు రైతులతో దురుసులుగా ప్రవర్తిస్తున్నారని రైతుల బ్యాంకు పాస్ బుక్కులను చించి వేస్తున్నారని ఇటువంటి తప్పుడు పద్ధతి మానుకోవాలని బ్యాంకులో రైతులకు రుణాలు ఇవ్వకపోవడం వలన రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వద్దనుండి నూటికి రూపాయలు 3 నుండి 5 వరకు అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్న పరిస్థితి ఉంది. దీని వలన రైతుల ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్.బి.ఐ. నిబంధనల ప్రకారం బ్యాంకులో ప్రజల వద్ద సేకరించిన డిపాజిట్ల నుండి 18% చిన్న సన్న కారు రైతులకు పంట ఋణాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికి బ్యాంక్ మేనేజర్ అమలు చేయడం లేదని. రైతులను వేధించడం సరికాదని ఆర్బిఐ నిబంధనలు అమలు చేయని లీడ్ బ్యాంకు మేనేజర్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా నిబంధనలను అమలు చేస్తు రైతులను ఆదుకోవాలని కోరారుఈ కార్యక్రమం లో వడ్లకొండ సుధాకర్ కన్నబోయిన నాగయ్య వేల్పుల పెద్ద రాములు చిన్న రాములు యాతం సమ్మయ్య వడ్లకొండ రాజు కొంతం అంజయ్య ఎల్లయ్య నరసయ్య బుల్లెదుడయా బక్క పిచ్చమ్మ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు