
E69NEWS న్యూస్ స్టేషన్ ఘనపూర్ ఏప్రిల్ 25
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్టీసీ & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా పరిష్కరించిందని, కేవలం 13 గంటల్లోనే కార్మికులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంఘాల ఎన్నికలు నిర్వహించడం, 11 శాతం పీఆర్సీ ప్రకటించడం వంటి కీలక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 55 రోజుల పాటు ఆందోళనలు చేపట్టినా, వారి సమస్యలను పరిష్కరించలేదని విమర్శించారు. ఆ సమయంలో సుమారు 35 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తు చేస్తూ, ఆ మరణాలకు అప్పటి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.కార్మికులతో చర్చలు జరపకపోవడం, సమ్మెలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టించడం, మహిళా కార్మికులపై కూడా లాఠీచార్జ్ చేయించడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు.ఇప్పుడేమో అదే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని, రాజకీయ లాభం కోసం చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి, సోషల్ మీడియా ఇంచార్జ్ మామిడ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రమేష్, గట్టు కోటి, జంపాల శ్రీనివాస్, మైనార్టీ నాయకులు ఖలీమ్, గట్టు శివ, తాళ్లపల్లి కుమార్, గట్టు రంజిత్, ఏలీయా, వీరస్వామి, సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.