మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి మహదేవపూర్
మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడిబిఐ సహకారంతో ఎంఎన్‌జె ఆసుపత్రి హైదరాబాద్,ఒమేగా ఆసుపత్రి కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్,కంటి నిర్ధారణ వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.హెల్త్ ఏటీఎం ద్వారా వేగంగా 64 రకాల పరీక్షలు చేసి,నివేదికలు 5 ఏళ్ల పాటు భద్రపరిచే సౌకర్యం కల్పించామన్నారు.పెరీ మీటర్,ఈసీజీ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.శిథిలావస్థలో ఉన్న మహదేవపూర్ ఆసుపత్రి భవనాన్ని ఆధునిక వసతులతో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు.ఆగస్టు 4న ఎంఎన్‌జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్,ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీకాంత్,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు,కాటారం ఆర్డీఓ రవీందర్,శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి,సర్పంచ్ హసీనా భాను అక్బర్,మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య,పిఎసిఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.