



ఈ69న్యూస్ ధర్మసాగర్ ఏప్రిల్ 01
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రాంతాన్ని విషాదంలో ముంచేసింది.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.వివరాల ప్రకారం, దేవునూర్ శివారు నుంచి కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు ముప్పారం సమీపానికి చేరుకునే సరికి వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఇద్దరు యువకులు ఘటన స్థలంలోనే మృతి చెందారు.ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే స్పందించి గాయపడిన వారిని గుర్తించి అంబులెన్స్‌కు సమాచారం అందించారు.తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి తరలించగా, మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.సమాచారం అందుకున్న ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.స్థానికుల సమాచారం మేరకు, గాయపడిన వారు తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందినవారని తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
class=”generate-image-btn”