నాగులగాని జయిన్ రావు అనారోగ్యంతో మృతి చెందారు.
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జూన్ 8
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగులగాని జయిన్ రావు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కౌడగాని బ్రదర్స్ మృతదేహాన్ని సందర్శించి
పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబానికి రూ.4,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆరె సంఘం పెద్దమనిషి కదం మహేందర్, మోతాజి,శ్యామ్ రావు,అంజయ్య, చిరంజీవి,నర్సింగరావు,సైదులు, రవి,చిట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు.