యశోద హాస్పిటల్ లో గ్యాస్టిక్ క్యాన్సర్ కు అరుదైన శాస్త్ర చికిత్స
యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ డాక్టర్ లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జన్ వై శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఇటీవలే ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక పేషెంట్ పితాశయం క్యాన్సర్ తో యశోద హాస్పిటల్ ను సంప్రదిస్తే ఆమెకు లివర్ ఫంక్షన్ టెస్ట్ లు చేసి అడ్వాన్సు లాపరోస్కోపిక్ , రోబోటిక్ సర్జరీ తో అరుదైన శాస్త్ర చికిత్స అందించామని పేర్కొన్నారు . గాలి బ్లాడర్ లో ఎక్కువ రోజులు స్టోన్స్ పెట్టుకున్న ఈ సమస్య వస్తుందని అన్నారు . ఈరోజుల్లో గ్యాస్టిక్ క్యాన్సర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని , సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల , జంక్ ఫుడ్ , సిగరెట్స్ మద్యపానం మరి కొంతమందికి వారస్వతంగా ఆడవాళ్లకు మగవాళ్లకు అందరికీ వస్తుందని తెలిపారు . వారసత్వంగా వచ్చే క్యాన్సర్లు ఈ జనరేషన్ వాళ్ళు కూడా వచ్చే అవకాశలు ఎక్కువ ఉన్నాయి . తక్కువ వయసు వాళ్లకు కూడా వస్తాయి . కొంతమంది ఫాస్టింగ్ చేసి వెయిట్ లాస్ అయ్యే వాళ్లకు మరియు ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్లు ఎక్కువ అవకాశలు ఉన్నాయన్నారు . వాళ్ల పేరెంట్స్ కి ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిందో టెన్ ఇయర్స్ ముందే రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసుకోవాలి . 5 ఇయర్స్ కి ఒకసారి ఎండోస్కోప్ , రెగ్గర్ అల్ట్రా సౌండ్ టెస్టులు చేయించుకుని ఫాలో అప్ చేసుకుంటే సింపుల్గా కంట్రోల్ చేసుకోవచ్చు . రెగ్యులర్ గా కడుపునొప్పి , బరువు తగ్గటం , ఆకలి లేకపోవడం , వాంతులు అవ్వడం లక్షణాలు ఉంటే అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నట్టు . వెంటనే సంబంధించిన డాక్టర్ ను సంప్రదించాలని అన్నారు . పేగు సర్జరీ చేస్తే మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు . మోస్ట్ డేంజర్ గాలి బ్లాడర్ క్యాన్సర్ . అవుట్ సైడ్ ఫుడ్ మ్యాగ్జిమం అవాయిడ్ చేయాలి . నిద్ర మంచిగుండాలి , ఎక్కువ స్టెయిన్ పడొద్దు మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి . మన యశోద హాస్పిటల్ హైదరాబాద్ సోమాజిగూడ లో అడ్వాన్స్ కీమోథెరపీ , రేడియోథెరపీ మరియు అన్ని విధాల క్యాన్సర్లకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సదుపాయం అందుబాటులో ఉంది అని అన్నారు . ఈ కార్యక్రమంలో Mr. శ్రీధర్ రావు , నాగార్జున , బాల కృష్ణ పాల్గొన్నారు .