తెలుగు గళం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్ హెచ్ జి మహిళా గ్రూపులు, గిరిజన మహిళలు, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర ప్రైవేట్ సంస్థలు వారు తయారు చేస్తున్న ఇతర ఆహార పదార్థాలను ప్రాచుర్యంలో కి తేవడానికి హెచ్ఎంటీవీ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహిస్తున్న ఆర్గానిక్ మేళలో భద్రగిరి మార్ట్, మిల్లెట్ మ్యాజిక్ స్టాల్ ఏర్పాటు, చేయడంతో పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు ఆర్గానిక్ నిత్యవసర సరుకుల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకునే అవకాశం ఉంటుందని ట్రైకార్ జిఎం శంకర్రావు అన్నారు.
హైదరాబాదు లోని ఐమాక్స్ థియేటర్ ఆవరణలో హెచ్ఎంటీవీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్గానిక్ మేళాలోని భద్రగిరి మార్టును ఆయన సందర్శించి ఆర్గానిక్ నిత్యవసర సరుకులు, మిల్లెట్ బిస్కెట్లు, జిసిసి ఉత్పత్తులు, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు తయారుచేసిన ఇతర ఆహార పదార్థాలు, మిల్లెట్ బిస్కెట్లు తనతోపాటు ఆయన వెంట వచ్చిన సిబ్బంది కొనుగోలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి ద్వారా సహజ సిద్ధమైన ఎటువంటి కల్తీ లేని ఎస్ హెచ్ జి మరియు గిరిజన మహిళలు తయారుచేసిన నిత్యవసర సరుకులు తప్పనిసరిగా పట్టణవాసులకు నచ్చుతాయని సాధ్యమైనంత వరకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు.ఆర్గానిక్ మేళ సందర్శించడానికి వచ్చిన ప్రజలు వారికి ఇష్టమైన ఆర్గానిక్ మరియు మిల్లెట్ కు సంబంధించిన నిత్యవసర సరుకులతో పాటు ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, జిసిసి ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి వచ్చే ప్రజలకు ఈ నిత్యవసర సరుకుల యొక్క గుణగణాలు మరియు వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేయాలని మేళాలో పాల్గొన్న మహిళలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భద్రగిరి మార్ట్ భద్రాచలం సిబ్బంది, భూదేవి, శివ, మంగ వేణి, సమ్మక్క, లలిత తదితరులు పాల్గొన్నారు.
