యువత స్వయం ఉపాధి తో ఆర్ధికంగా ఎదగాలి
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు
పెండ్లి రఘువీర్ రెడ్డి యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి అన్నారు.బైరి సాయి ఏర్పాటు చేసిన చికెన్ సెంటర్ ను ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నేటి కాలంలో ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా యువత చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రారంభించి స్వయం సమృద్ధి సాధించవచ్చన్నారు. కష్టపడి పనిచేస్తూ నూతన ఆలోచనలతో ముందుకు సాగితే యువత తమ కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడగలరని పేర్కొన్నారు. స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించి ఆర్థిక ప్రగతికి దోహదపడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో రాంపురం మాజీ సర్పంచ్ రాంపెల్లి అబ్బయ్య గౌడ్,యల్ది విజయ్ గౌడ్, వంగ మహేందర్ రెడ్డి, జెల్ల సతీష్, రాంపెల్లి నాగన్న గౌడ్, బైరి వెంకన్న గౌడ్, లింగన్న గౌడ్, యల్ది నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.