రేగొండ శివారులో రోడ్డు ప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల శివారులోని గంగరావు చెరువు సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదంలో గాంధీనగర్‌కు చెందిన దొంగల చందు (27), రంగయ్యపల్లి గ్రామానికి చెందిన సిల్ వేరు పైడి (50), సీతారాంపురం గ్రామానికి చెందిన కుమార్ యాదవ్ (48) గాయపడ్డారు. వీరికి కాళ్లు విరగడం తో పాటు తలకు గాయాలు అయినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో రేగొండ ఎస్సై సుధాకర్ మానవతా దృక్పథంతో స్పందించారు.తన సొంత వాహనంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు.ఎస్సై సుధాకర్ చేసిన ఈ సహాయానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.సమయస్ఫూర్తితో స్పందించి గాయపడిన వారికి తక్షణ చికిత్స అందేలా చేసిన పోలీస్ అధికారిపై ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు