లంబాడీ కుల సంఘాల అధ్వర్యంలో గోడ పత్రిక ఆవిష్కరణ
మరిపెడ గ్రామం మాకుల తండా పరిధిలో ఉన్న భావసంగ్ మహారాజ్ మరియు మ్యారమా భవానీ మాకుల క్షేత్ర జాతర పోస్టర్ ను డోర్నకల్ నియోజకవర్గం లో ఉన్న మరిపెడ హెడ్ క్వార్టర్ లో ఉన్న ఐబీ గెస్ట్ హౌస్ లో ఈ రోజు పోస్టర్ను ఆవిష్కరణచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ హాజరు అవ్వడం జరిగింది.ఈ పోస్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు రెండవ తారీఖున మాకుల భావసంగ్ బావా క్షేత్రం లో స్వామి తలంబ్రాల కార్యక్రమం ఉంటుంది అలాగే 15 వ తారీకున బండ్లు తిరిగే కార్య క్రమం ఉంటుంది అని తెలియ చేస్తూ ఆ రోజున జాతి తరుపున 7 గురు అమ్మవార్లకు అలాగే 6 గురు జాతి గురువులకు భోగ్ భండార్ కార్యక్రమం ఉంటుంది అని పేర్కొంటూ మాకుల రెండవ జాతి ఆత్మ గౌరవ సదస్సు ఉంటుంది అని తెలియచేయడమే అని పేర్కొన్నారు.బావసంగ్ మహారాజ్ పేరు మీద మా లంబాడీల కు స్వామి వారు ప్రీతిపాత్రులు అని గుర్తు చేశారు,ముఖ్యంగా స్వామి భక్తులైన హతిరం మహారాజ్ అలాగే భావ సంగ్ మహారాజ్ అలాగే మా యొక్క బుడియ బాపూ లు మా యొక్క లంబాడీ ప్రజలకు ప్రీతి పాత్రులు,అందులో భాగంగా రంగుండ్లలో బుడియా బాపూ గుడి ఉంది అలాగే ఇక్కడ మరిపెడ మాకుల తండాలో భాసింగ్ మహరాజ్ గుడి ఉంది అలాగే తిరుపతి కొండ మీద హాతి రామ్ మహారాజ్ గుడి ఉంది అని తెలియ చేశారు.ఈరోజు తెలంగాణ రాష్ట్రం లో చూసుకుంటే లోకమసంద్ మహారాజ్ ఉత్సవాలు రాష్ట్ర పండగగా జరుగుతున్నాయి అందుకోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము,అలాగే ముఖ్యంగా మరిపెడ మండలం మా కుల తండా లో మా యొక్క ప్రజలకు మా భక్తులకు భావసంగ్ మహారాజ్ ప్రీతిపాత్రుడు అలాగే మ్యారమా భవాని పేరు మీద మాకుల ఏడుగురు మాతలలో ఒకరు కొలువు అయి ఉన్నారు,విగ్రహ ప్రతిష్ట పూజ కూడా పోయిన సంవత్సరం చేయడం జరిగింది.భావసంగ్ మహారాజ్ బండ్లు తిరిగే రోజున ఇక్కడ మా వాళ్ళు మేకపోతులను సమర్పిస్తారు అని కూడా తెలియ చేశారు.కావున వెంకటేశ్వర స్వామి అంశ భావసంగ్ మహారాజ్ పేరు మీద ఏదైతే గుడి ఉందో వారి యొక్క కల్యాణము 2 వ తారీకున ఉంది, అలాగే 15వ తారీఖున బండి తిరిగే కార్యక్రమం ఉంది కాబట్టి రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ హాజరు కావాలని భక్తులను కోరడం జరిగింది.మ్యారమా భవానీ విగ్రహ ప్రతిష్ట గౌరవ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి చేతుల మీద జరిగి ఒక్క సంవత్సరం అవుతున్న కూడా ఎలాంటి పేర్లు గాని రాయలేదు అలాగే ఎలాంటి శిలాఫలకం కానీ పెట్టలేదు కావున మా యొక్క లంబాడీ కుల సంఘాల తరుపున లంబాడీ బావాజీ సంఘాల తరఫున మేము కోరుకునేది ఒకటే మా అమ్మవారు మ్యారమాభవాని పేరు మీద శిల ఫలకాలు అలాగే బోర్డు లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము.అలాగే ఎలాగైతే లోక మసంద్ మహారాజు పండగ ఈ రోజు రాష్ట్ర పండగగా గుర్తించి నాలుగు రోజులు కలెక్టర్ గారు అక్కడ నారాయణపేట జిల్లా లో ఉత్సవాలు చేస్తున్నారో ఆ విధముగా మాకుల భావసంగ్ మహారాజ్ గారి ఉత్సవాలను రాష్ట్ర స్థాయి పండగగా గుర్తించాలని కోరుకుంటున్నాము అని జాదవ్ రమేష్ నాయక్ తెలిపారు.ఈ కార్య క్రమం లో లంబాడీ సంఘాల రాష్ట్ర నాయకులు భరత్ నాయక్, జిల్లా నాయకులు భూక్యా గోపి నాయక్, బోడ రమేష్ నాయక్, జరుపుల సురేష్ నాయక్,మాకుల మ్యారామా భవానీ బుడియా బాపు పూజారి సీతారాం నాయక్, రాజేష్ నాయక్ భూక్యా, రాజేష్ నాయక్ ధారావత్, రాజేందర్ నాయక్ , మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.