సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి
వరి ధాన్యం మొక్కలు కొనుగోలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
తక్షణం కొనుగోలు వేగవంతం చేసి జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకోవాలి
సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి
తెలుగు గళం న్యూస్ జనగామ మే11
ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న వరి ధాన్యం పంటల కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని తక్షణం జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకోవడం కోసం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం మొక్కలు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజల్ని సమీకరించి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనుక రెడ్డి ప్రభుత్వాలను హెచ్చరించారు.గత వారం రోజులుగా జిల్లాలోని ఐకెపి కేంద్రాలను మొక్కల కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లులను సిపిఎం ఆధ్వర్యంలో సందర్శించి సమస్యల్ని తెలుసుకోవడం జరిగింది .ఈ సమస్యల పరిష్కారం కోసం సోమవారం రోజు జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తే అధికారులు స్పందించని తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ 11 గంటల నుండి రెండున్నర గంటల వరకు ఎర్రటి ఎండలో ధర్నా నిర్వహించడం జరిగింది.అధికారులు స్పందించకపోవడంతో సిపిఎం నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లడం కోసం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.స్వల్ప ఉధృత చోటుచేసుకుంది. జనగామ పోలీస్ సిఐ సత్యనారాయణ రెడ్డి చోరవతో జిల్లా సివిల్ సప్లై డియం హతి రామ్ నాయక్ డిఎస్ఓ డిటివోలు ధర్నా వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు జరుగుతున్న జాఫియాన్ని సరి చేస్తామని ట్రాన్స్పోర్ట్ ఎగుమతి దిగుమతులను వేగవంతం చేస్తామని రైతుల కొన్న ధాన్యానికి తొందరగా పడే విధంగా చర్యలు చేపడతామని సమస్యలు పరిష్కరిస్తామని వారం రోజులలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం ఈసందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ గత నెల రోజులుగా ఐకెపి కల్లాలలో వరి ధాన్యం మొక్కలు కొనుగోలు కేంద్రాలలో రైతులు పని పాటలు వదిలేసి వ్యవసాయం బాయిని వదిలేసి కొనుగోలు కేంద్రాల చుట్టూ పడిగాపుల కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే రైస్ మిల్లర్స్ తరుగు పేరుతో బస్తాకు రెండు నుంచి మూడు కిలోల వరకు కొన్ని ప్రాంతాలలో వడ్లను తీసుకుంటున్నారని రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంటా అయిన ఒడ్లు లారీలు అందక ట్రాన్స్పోర్ట్ కాకపోవడం వల్ల రోజుల తరబడి కల్లాలలోనే వడ్లు బస్తాలు చెదలు పడుతున్నాయని ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అన్నారు.పేరుకే జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వడ్ల కొనుగోలు అలసత్వం జరిగితే సహించనని ప్రకటన చేస్తున్నాడు తప్ప ఆచరణలో ఇప్పటివరకు జిల్లాలో ఇప్పటికీ 40 శాతం దాన్యం సేకరణ కూడా చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా అన్నీ తానై నడిపించడం కాకుండా సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులతో అధికారులను సమన్వయం చేసుకొని టీంవర్క్ చేయించి రైతులు పండించిన పంటలను వర్షాకాలం ముంచుకొస్తున్నందున తక్షణం కొనుగోలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య సింగారపు రమేష్ సాంబరాజు యాదగిరి ఇర్రి అహల్య బొట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి జోగు ప్రకాష్ సంచు విజేందర్ బోడ నరేందర్ పొత్కనూరి ఉపేందర్ మునిగల రమేష్ చిట్యాల సోమన్న గంగాపురం మహేందర్ ఎండి అజారుద్దీన్ గుండెబోయిన రాజు మండల కార్యదర్శిలు మాచర్ల సారయ్య బొడ్డు కరుణాకర్ నాయకులు రమావత్ మీట్య నాయక్ గండి అంజయ్య తూటి దేవదానం కుర్ర ఉప్పలయ్య భల్నే వెంకట మల్లయ్య అన్నబోయిన రాజు పల్లెర్ల లలిత మంగ బీరయ్య అజ్మీర సురేష్ నాయక్ గోసంగి శంకరయ్య ఎండి హతియా మోకు భవాని సోమ సత్యం పోలాసు పరమేష్ కాసాని పుల్లయ్య అపరాధపు రాజు పాముకుంట్ల రేణుక గాడి శివ చిలుముల భాస్కర్ మబ్బు ఉప్పలయ్య పయ్యావుల బిక్షపతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.