వేణుగోపాల స్వామి కళ్యాణానికి ఘన ఏర్పాట్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గడిపల్లి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో స్వస్థ శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర బహుళ నవమి సందర్భంగా, ఏప్రిల్ 11,2026 శనివారం రోజున వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ జిట్ట రామకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా ఉదయం 11 గంటల 42 నిమిషాలకు శ్రావణ నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నంలో, పుష్కరాంశ శుభ ముహూర్తంలో గోపాలుని కళ్యాణం వైభవంగా జరుగుతుందని పేర్కొన్నారు.ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి దర్శనం పొందాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.అలాగే ఈ సందర్భంగా నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.వేణుగోపాల స్వామి సన్నిధిలో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో హాజరవుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అర్చకులు తాడూరి నరేష్, సముద్రాల సురేష్ పాల్గొనగా, గ్రామ ప్రముఖులు గంగుల రాజు రెడ్డి, నాముల రమేష్, గోగుల అశోక్ రెడ్డి, మూస్కె రమేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.