సత్తుపల్లి లో జయశంకర్ బడి బాట
పీఎంఎస్హ్రీ ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బండి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రిహన కమల్ పాషా శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ రిహన కమల్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవడం అవసరమని పేర్కొన్నారు.
మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు మాట్లాడుతూ బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల నమోదు పెంపుతో పాటు మధ్యలో చదువు మానివేతను నివారించడం, నాణ్యమైన విద్య అందించడం ప్రధాన లక్ష్యమని వివరించారు.
కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శైల కుమారి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో గరిష్ట సంఖ్యలో విద్యార్థులను చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో చేరి మెరుగైన విద్యను పొందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో: పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నారావు, కమల్ పాషా, 18వ వార్డు కౌన్సిలర్ మానస రాము, మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శైల కుమారి, పాఠశాల సిబ్బంది రాణి కుమారి, సరిత, అబ్దుల్ మజీద్, వెంకటలక్ష్మి, అంగన్వాడీ ఉపాధ్యాయులు కృష్ణకుమారి, పద్మ తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.