మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరు
మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ హాజరు
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 5
పర్వతగిరి,భారతీయ జనతా పార్టీ పర్వతగిరి మండల స్థాయి సర్ సర్వేపై సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు,బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ సర్ సర్వే ప్రాముఖ్యతను వివరించారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి, ప్రతి ఓటరు వివరాలను సేకరించడానికి సర్ సర్వే ఎంతో కీలకమని బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టపరిచేందుకు అందరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.మండల కన్వీనర్ గొల్లపల్లి సంతోష్ కుమార్అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుడికాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శులు బత్తిని దేవేందర్, జాటోత్ రవి, సీనియర్ నాయకులు పిచ్చిరెడ్డి చంద్రయ్య, లక్ష్మణ్, రాజు, రంజిత్, ప్రభాకర్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.