అంగన్వాడీల్లోనే పిల్లకు పౌష్టిక ఆహారం.అంగన్వాడీల్లోనే పిల్లకు పౌష్టిక ఆహారం.
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ30 May, 2026E69NEWS

అంగన్వాడీల్లోనే పిల్లకు పౌష్టిక ఆహారం.

అంగన్వాడీల్లోనే పిల్లకు పౌష్టిక ఆహారం.

అంగన్వాడీ కేంద్రాల్లోనే పిల్లలకు పౌష్టిక ఆహారం అందుతుందని ఆత్మకూరు తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు అంగన్వాడీల్లో పిల్లలకు విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందుతుందని అన్నారు.మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లలను అంగన్వాడీ లో చేర్పించాలని తల్లితండ్రులను కోరారు.ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల ఎదుగుదలకు అంగన్వాడీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లో అంగన్వాడీల్లో అనేక వసతులతో పాటు, నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతోపాటు, నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలకు ధ్రువపత్రాలు, స్కూల్ యూనిఫామ్స్, అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి, ఉపసర్పంచ్ బయ్య పైడి, వార్డు సభ్యులు కుమారస్వామి, రవి, సందీప్, కార్యదర్శి శ్వేత, అంగన్వాడి టీచర్లు పెరుమాండ్ల దేవమ్మ, పుష్పనిల, పద్మ, కరుణ, వాణి, శ్రీవిద్య, తదితరులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *