తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివా
సత్తుపల్లి,ఆర్ సి,ఆగస్టు07(తెలుగుగళం) న్యూస్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న నిర్వహించే దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
శుక్రవారం సత్తుపల్లి ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, అన్ని పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అమలు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 200 రోజుల పని, రోజుకు రూ.800 వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు.
సమావేశంలో జాజిరి జ్యోతి, కావూరి వెంకటేశ్వరరావు, కావ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, ఎలగం రాములు తదితరులు పాల్గొన్నారు.