E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

కాకతీయ యూనివర్సిటీ మెస్‌లో ఉప్మాలో పురుగులు..విద్యార్థుల ఆగ్రహం

హనుమకొండ, జూన్ 28 (ఈ69న్యూస్)

కాకతీయ యూనివర్సిటీ మెస్‌లో ఆదివారం ఉదయం వడ్డించిన ఉప్మాలో పురుగులు కనిపించాయని విద్యార్థులు ఆరోపించారు.నాసిరకం ఆహారం అందిస్తున్నప్పటికీ పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మెస్‌లో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు విమర్శించారు.విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే, యూనివర్సిటీ మెస్‌లో హాస్టల్‌కు చెందని నాన్-బోర్డర్స్ కూడా భోజనం చేస్తున్నారని, దీనివల్ల అసలు హాస్టల్ విద్యార్థులకు సరిపడా భోజనం అందడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, ఆహార నాణ్యతను మెరుగుపరచడంతో పాటు మెస్ నిర్వహణలో ఉన్న లోపాలను సరిదిద్దాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *